Health Tips: జ్వరం ఉంటే..

జ్వరం ఉంటే చేయవలసిన పథ్యములు..
1. రోగికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. చక్కని నిద్ర కావాలి.
2. జ్వరం తగ్గేవరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్దాలు, పండ్ల రసాలు, జావా, బార్లీ, జావా, బత్తాయి జ్యూస్, యాపిల్, కివి fruits, ఆవు పాలు, నూకలు జావా, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, ఆవునెయ్యి, తేనే, కరివేపాకు, వేడినీరు, మరియు కాచి చల్లార్చిన నీరు, ors , కొబ్బరిబోండా నీరు, మునక్కాయ, ద్రాక్ష, దానిమ్న, నారింజ, చెర్రీ పండు , ఆలుబకర, ఇవ్వాలి, పలుచటి మజ్జిగలో కొద్దిగా, ఉప్పు, లేదా రాక్ సౌల్ట్, కలిపి తాగించాలి. మాంసాహారం ఇవ్వకపోవటము మంచిది. నీరు బాగా తాగాలి. బియ్యం, పసుపు, పెసరపప్పుతో చేసిన కిచిడి తినిపించాలి.
తినకూడనివి
గురు పదార్థాలు, జీర్ణం కానివి, ఎక్కువగా శ్రమ చేయవద్దు, ఫ్రై చేసిన, మరియు ఆయిల్ పదార్దాలు తినరాదు. ఆల్కహాల్, బీడి, సిగరెట్, మత్తుపానియలు తీసుకోరాదు. రాత్రి ఎక్కువ సేపు మేల్కొరాదు. టీవీ, సెల్ ఫోన్ ఎక్కువగా చూడరాదు. సంభోగం చేయరాదు, శరీరానికి తాహతుకు మించి వ్యాయామం చేయరాదు.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు