Healthy Diet

ఎముకలు పుష్టి కొరకు మరియు హెయిర్ గ్రోథింగ్ కి దినచర్య మరియు యోగసనాలు, ప్రాణాయామము,food&nutrition.
1. తెల్లవారుజామున కాల కృత్యములు చేసుకోని,కింద కూర్చోని రెండు గ్లాసులు నీళ్లు తాగవలెను.నిలబడి నీరు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
2. ఉదయం శరీరంలో నొప్పులు ఉన్నచోట నువ్వులు నూనెను జెంటిల్ మసాజ్ చేసి రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు వాకింగ్ చేయవలెను, లేలేత గా వున్న ఎండలో నడక చేయవలెను.శరీరానికి అల్ట్రా వైలెట్ కిరణాలు తగిలి, శరీరం ద్వారా డి విటమిన్ చక్కగా అందుతుంది. మరియు శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కరిగి డి విటమిన్ అందుతుంది.
3. వాకింగ్ చేసిన 45 నిమిషాల తర్వాత చక్కని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి.కాలాన్ని బట్టి వేడి,లేదా చల్లగా వున్న నీటితో స్నానం చేయండి.
4.ప్రతిరోజు ఉదయం టిఫిన్ క్రింది విధంగా తీసుకొనవలెను.వారంలో రెండు రోజులు, గ్రీన్ టీ, రెండు రోజులు లెమన్ టీ, తీసుకోవలెను.ఒక గంట తరువాత మనకు నచ్చిన టిఫిన్ చేయవచ్చును.గోరువెచ్చని నీళ్లలో లేకపోతే పాలలోని అశ్వగంధ చూర్ణం అర టి స్పూన్ తీసుకోవలెను.
5. పరిగడుపున పాలల్లో అశ్వగంధ చూర్ణం తీసుకున్నట్లయితే మరల ఆకలి వచ్చినంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో టిఫిన్ చేయరాదు. ఆకలి పుట్టినప్పుడు మాత్రమే టిఫిన్ చేయవలెను.
6   ఉదయం టిఫిన్ లో
  •   సోమవారం క్యారెట్ బీట్రూట్, తేనె నిమ్మరసం కలిపిన జ్యూస్ తాగవలెను,
  • మంగళవారం మొలకెత్తిన విత్తనాలు తీసుకోవలెను
  •  బుధవారం మొక్కజొన్న విత్తనాలు మరియు బెల్లం కలిపి తినవండి,
  •  గురువారం నువ్వులు లుండలు,పాలు తీసుకోగలరు,
  •  శుక్రవారం గోధుమ గడ్డి జ్యూస్ లో , తేనే కలిపి తీసుకోవాలి. ఒక గంట ఆగిన తర్వాత ఏదైనా టిఫిన్ చేయవలెను రాగి జావా, జొన్న జావా ఏదైనా తాగవచ్చును ,
  •  శని,ఉదయం పరిగడుపున తిప్పతీగ జ్యూస్ 2 tea స్పూన్స్, నీరు సమానంగా కలిపి తాగవలెను. ఒక గంట తరువాత ఇడ్లీ తినవచ్చును.
  • ఆదివారం మీకు ఇష్టమైన టిఫిన్ చేసుకోవచ్చు.
7. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పల్చటి మజ్జిగ తాగవలెను.
8. ఆహారంలో మాంసాహారి అయితే వారంలో రెండు సార్లు నాన్ వెజ్ తీసుకోవలెను,ఒకసారి ఫిష్, మరియు మరోసారి లివర్, egg లో పశుపచ్చగా ఉండేటటువంటి పదార్థము తీసుకోవలెను.
9. వెజిటేబుల్ అయితే సోయాబీన్ మరియు సోయాబీన్ తో తయారు చేసినటువంటి పాలు, జున్ను పాలు, పన్నీరు పుట్టగొడుగులు, ముల్లంగి మునగ ఆకు, ఆకుకూరలు, తోటకూర, నువ్వుల ఉండలు, రాగులు ఇవి ఆహారంలో తీసుకోవలెను.ఆకుకూరలు, కూరగాయలు తీసుకువలెను
10. రాత్రి భోజనం త్వరగా జీర్ణం అయ్యేటటువంటిది ఆహారం తీసుకోవలెను.(రాత్రి నిద్ర పట్టకపోతే పాలలో అశ్వాగంద చూర్ణం తీసుకువలెను.)
11.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్ వేసుకొని తాగవలెను.
12. యోగాసనాల్లోని భుజంగాసన, సలభాసనము, మకరాసనం, సర్వాంగాసనం, శవాసనం చేయవలెను
13. ప్రాణాయామంలోని కపాల భాతి, అనులోమ విలోమము, ఉజ్జయిని చేయవలెను.
14. హెయిర్ లాస్ ఉన్నవాళ్లు. పచ్చి బఠానీ కర్రీని వారంలో రెండు సార్లు తినవలెను.
15. హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోథింగ్ కావాలంటే తెల్లవారుజామున రెండు టీ స్పూన్స్ ఉసిరికాయ జ్యూస్ రెండు టీ స్పూన్స్ తేనే కలిపి తీసుకోవలెను.ఒక గంట వరకు ఎటువంటి ఆహారము గాని నీరు. తీసుకోవద్దు
16. హెయిర్ గ్రోథింగ్ కి డాబర్ ఆల్మండ్ oil వాడవలెను.
17. కపాలభాతి అనులోమావిలోమం అర్థగంట చేయవలెను. మరియు సర్వాంగాసనం వేయవలెను.
18. హెయిర్ గ్రోథింగ్ కి నీరు ఎక్కువగా తాగవలెను, డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవలేను.
19. హెయిర్ గ్రోథింగ్ కి 40 రోజుల వరకు రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లలో తీసుకోవలెను. వాతాన్ని పిత్త, కఫాన్ని సమం జేసి హెయిర్ గ్రోథింగ్ ని చక్కగా పెంచుతుంది. స్ట్రెస్ తగ్గించుకోండి
20. బయట పదార్థాలు తినరాదు. పిజ్జా బర్గర్ నూడిల్స్ స్నాక్స్ కూల్ డ్రింక్స్, ఆలు చిప్స్, ఆల్కహాల్, వీటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది..
21. సమయానికి నిద్రపోండి సమయానికి మేలుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
22. రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీటిలో 4 బాదం, ఒక గ్లాసు నీటిలోఎండు ఖర్జూర 2,మరియు,ఒక గ్లాసు నీటిలోని 10 కిస్మిస్లు, ఒక గ్లాసు నీటిలోని 2 అంజీర, వీటిని నానబెట్టి ఉదయం తెల్లవారుజామున బాదం పైన పొట్టు తీసి తినవలెను.
24. హెచ్చరిక.. ఎవరికైనా ఏసీడీటీ కానీ, గర్భవతి గాని, పాలిచ్చే తల్లులు, మరియు పొట్టకు సంబంధించిన రోగాలు ఉన్నట్లయితే పైన ఇచ్చిన డైట్ ను ఆచరించవద్దు.. దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించే సలహాలు సూచనలు మేరకు డైట్ ని ఫాలో అవ్వండి. . అనారోగ్యులు మరియు ఆరోగ్యవంతులకి అందరికీ
చక్కగా పనిచేస్తుంది.
25. 40 రోజుల వరకు ఉదయము ఉసిరికాయ జ్యూస్ ని తేనెను కలిపి తీసుకున్నట్లయితే,కంటికి,వెంట్రుకలకి, చర్మానికి ఆరోగ్యవంతంగా ఉంచుతూ, ఇమ్యూనిటీ పవర్ గా పని చేస్తుంది.

— షేక్ బాహర్ అలీ

 7396126557

Leave A Reply

Your email address will not be published.