గుండె జ‌బ్బుల‌కు కార‌ణాలు, ల‌క్ష‌ణాలు నివార‌ణ‌

World Heart Day, 29 September

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, మనము హార్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత గల అవయవము గుండె. గుండె బలమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది. కుడి ఎడమ ఊపిరితిత్తుల మధ్య ప్రధానంగా ఉండే ఈ గుండె దాదాపు ఆయా వ్యక్తి యొక్క పిడికిలి సైజులో ఉంటుంది. ఛాతి లో చాలా చక్కగా భద్రంగా ఉంటుంది గుండె.

గుండె ఉండేది గుప్పెడంత, కానీ కొండంత అండ. పైగా గుండె గనుక నీరసవడితే నీరుగారి పోవాల్సిందే. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
చరై వేతి,- చరై వేతి అనే మూలమంత్రం తో పని చేస్తూ వుంటుంది. పిండం ప్రాణం పోసుకున్న నాటి నుండి అంతిమ దశ వరకు కూడా శ్రమ పడుతూనే ఉంటుంది.
శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. ఆ రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ప్రాణవాయువు నింపుతూ శరీరానికి సరఫరా చేస్తూ హాయిగా ఉంచుతుంది. గుండె చేసే పని లెక్క కట్టినట్లయితే ఒక వ్యక్తి జీవిత కాలంలో 260 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. ఒక వ్యక్తిలో ఉండే రక్తం 5 లీటర్లు తిరిగి తిరిగి దాన్ని పంపు చేయడానికి లెక్క బెడితే గుండె నుంచి 40 కోట్ల లీటర్లు పంపైనట్లు లెక్క, ఇలా పంపు చేసిన రక్తం రక్తనాళాల ద్వారా శరీరంలోకి ప్రతి అంగానికి చేరుతుంది.

ఇంత నిర్విరామంగా పనిచేసే గుండె 300 గ్రాములు ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలకి 50 గ్రాములు తక్కువగా ఉంటుంది. గుండె బేరి పండు లాగా ఉంటుంది.

గుండె ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది. ఒకటి శరీరానికి వివిధ భాగాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని స్వీకరిస్తుంది.
రెండవది, శ్వాసకోశాల నుంచి శుద్ధి అయి వచ్చిన మంచి రక్తాన్ని శరీరంలో వివిధ భాగాలకు పంపుతుంది.

శరీరంలో ప్రతి కణం తన పని ద్వారా బొగ్గు పులుసు వాయువుని వదులుతుంది. గుండె ప్రాణవాయువు నింపిన రక్తాన్ని పంపు చేయగా అది కణాలన్నింటికీ చేరుతుంది. రక్తం ద్వారా తమ దగ్గరికి చేరిన ప్రాణవాయువుని స్వీకరించి తమ పని ద్వారా తయారైన బొగ్గు పులుసును వాయువునీ రక్తంలో వదిలి వేస్తాయి. రక్తంలో బొగ్గు పులుసు వాయువుని స్వీకరించి గుండె దగ్గరికి చేర్చగా ఆ చెడు రక్తాన్ని శ్వాసకోసాల్లోకి పంపుతుంది. గుండె శ్వాసకోశాలు రక్తంలో బొగ్గు పులుసు వాయువుని తీసివేసి ప్రాణ వాయువుని నింపి తిరిగి గుండెకు చేరవేస్తాయి. ప్రాణ వాయువుతో నిండిన రక్తం తిరిగి శరీరంలో వివిధ భాగాలకు సరఫరా అవుతుంది.

ఆయుర్వేద లెక్క ప్రకారం గుండె జబ్బులను 5 రకాలుగా విభజించారు. వాతజ, పిత్తజ కఫజ, సన్నిపాతజ మరియు క్రిమిజ హృద్రోగములు.

 గుండె జబ్బులు రావడానికి గల కారణం

  • 1. అధిక బరువు.
  • 2. శారీరక వ్యాయామం లేకపోవడం
  • 3. సరైన నిద్ర లేకపోవడం
  • 4. మానసిక ఒత్తిడి
  • 5. వంశపారపర్యంగా
  • 6. ఆల్కహాల్ తాగటం
  • 7. బీడి, చుట్ట, సిగరెట్ తాగటం
  • 8. పాన్ పరాగ్ , గోవా, గుట్కా తినటం
  • 9. అధికంగా క్రొవ్వు ఉండే ఆహారం పదార్థాలు తీసుకోవడం.
  • 10. బజార్ లో దొరికే పిజ్జా, బర్గర్,పిస్తా, నూడిల్స్, స్నాక్స్ పిల్లలకి ఎక్కువగా తినిపించడం.
  • 11. సెల్ ఫొన్ ఎడమ చేతిలో ఎక్కువసేపు పట్టుకోవడం వలన గుండె మీద భారం పడటం.
  • 12. దీనివల్ల ఛాతి మధ్యలో తీవ్రమైన నొప్పి ఉంటుంది ఆ నొప్పి కత్తి కోసినట్లుగా తీవ్రంగా ఉంటుంది. హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఉంటాయి రోగికి కంగారు ఎక్కువగా ఉండి మూర్చ పోవటం కూడా జరుగుతుంది. ఛాతిలో మంట ఛాతి బరువు గా ఉండటం, నీరసం, అధికంగా చెమట పట్టటం, నోరు ఎండి పోవటము మొదలగున్నవి అపస్మారకస్థితి చేరును. ఛాతి అతి బరువు ఉండుట చాతిలో గుచ్చినట్టు ఉంటూ ఆకలి లేకపోవడం తలనొప్పి రావటం పాదాలు వాచి పోవటము జరుగుతాయి.
  • 13. ఈ నొప్పి ఎడమ భాగంలోనే కాకుండా ఎడమ భుజానికి కూడా ప్రాకుతుంది .కొన్నిసార్లు నొప్పి కడుపు భాగంలో కూడా ప్రాకుతుంది.
  • 14. ఒక్కోసారి గుండె నొప్పితో ఆయాసం వచ్చి నిద్ర కూడా పోనివ్వదు.
  • 15. నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది
  • 16. పాదాలు వాచటం, పాదాలని నోక్కినట్లయితే గుంటలుగా పడటం జరుగుతుంది.

దీని నివారణకు గానూ కాలాన్ని బట్టి వచ్చే ఆహారం పదార్థాలు తీసుకోవాలి, కూరగాయలు ఆకుకూరలు, తృణమూల ధాన్యాలు,సిరి ధాన్యాలు, పప్పులు, సొరకాయ, బీరకాయ, ఆహారంగా తీసుకోవాలి. నూనే తో చేసే వంటకాలు, ఉప్పు కారం, చల్లని పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, తీసుకోరాదు. మద్యం మానివేయాలి. గ్యాస్ ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు, ఆలుగడ్డలు, దుంపలు వీటిని తక్కువగా వాడాలి.

జామ, బత్తాయి , దానిమ్మ , ఆపిల్, ద్రాక్ష, కివి, బొప్పాయి, తినాలి. బత్తాయి, పుచ్చకాయ ,చెరుకు రసం, నీటిని ఎక్కువగా తాగాలి. బీట్రూట్, క్యారెట్, కీరా, టమాటా, ముల్లంగి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క వీటిని ఆహారంలో అధికంగా తీసుకోవాలి. వీటితో రక్తం శుద్ధి అవుతుంది. దాంతో గుండె చక్కగా పనిచేస్తుంది.

గుండె జబ్బులకు ఆయుర్వేద చిట్కాలు

1. కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజు మూడు గ్రాములు తీసుకున్నట్లయితే గుండెకు సంబంధించినటువంటి జబ్బులు రావు.

2. అర్జున (తెల్లమద్ది) చెట్టు బెరడు చూర్ణాన్ని 5 గ్రాములు 200 మిల్లీ గ్రామ్ నీటిలో కలిపి బాగా మరిగించి 50 మిల్లీ గ్రాములు చేసి దాని వడపోసి ఉదయం పరిగడపున తాగవలెను. గుండెకు మంచి ఉపయుక్తంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ నీ సంప్రదించి తీసుకోవలెను.గర్భవతులు,పిల్లలకు పాలిచ్చే తల్లులు తీసుకోరాదు.

3. మార్కెట్లో అర్జునరిష్ట దొరుకుతుంది దానిని వాడుకోవచ్చు.

4. వెల్లుల్లి 3 నుంచి 4 గ్రాములు సేవించినట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది గుండె జబ్బులు తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.

గుండె జబ్బులు తగ్గటానికి యోగాసనాలు.

  • 1. త్రికోణాసనం
  • 2. గోముఖాసనం
  • 3. ఉస్ట్రాసనం
  • 4. భుజంగాసనం
  • 5. శలభాసనం
  • 6. పాదోత్తా సనం
  • 7. సర్వాంగాసనం
  • 8. శవాసనం.
  • 9. భస్త్రిక ప్రాణాయామము
  • 10. కపాల భాతి ప్రాణయామము
  • 11. అనులోమా విలోమా ప్రాణ
  • 12. ఉజ్జయిని ప్రాణయామము

ఈ ఆసనాలు చేసినట్లయితే గుండె పదిలంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది.

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557

Leave A Reply

Your email address will not be published.