హైదరాబాద్‌లో పలు చోట్ల దంచికొట్టిన వాన

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరంలో కురిసింది.
ముఖ్యంగా నగరంలోని నారాయణగూడ, బాగ్‌లింగంపల్లి, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, సోమాజిగూడ, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, కోఠి, అఫ్జల్ గంజ్, జియగూడ, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, టోలిచౌకీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం మూలంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.