ఇవాళ‌, రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

హైద‌ర‌బాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్ర‌భావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

రాగల 24 గంటల్లో మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలిక పాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.