AP: 24 గంటల్లో రాయలసీమలో భారీ వానలు!

అమరావతి (CLiC2NEWS): గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 చోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తిరుపతిలో 39.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.