Delhi: దేశ రాజధానిలో కుండపోత వర్షాలు.. విమానాశ్రయంలోకి వరదనీరు
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విమానాశ్రయంలో కూడా భారీగా నీరు చేరుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరదనీరు చేరడం వలన విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టులోని నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఈస్థాయిలో కుండపోత వర్షాలు కురవడం 46 సంవత్సరాల్లో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న 12 గంటల్లో రాజధానిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధానికి ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.