టాలివుడ్ డ్రగ్ కేసు.. సిఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ (CLiC2NEWS): టాలివుడ్ డ్రగ్స్ కేసులో ఈడి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. సిఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
డ్రగ్ కేసులో నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడి గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీంతో సిఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈగి పిటిషన్ దాఖలు చేశారు.