నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS): సైదాబాద్​ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మేజిస్ట్రేట్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ వేసిన పిల్‌పై న్యాయస్థానం ఇవాళ (శుక్ర‌వారం ) విచారణ జరిపింది. రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్​ హైకోర్టుకు వివరించారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియో చిత్రీకరణ జరిగిందని విన్నవించారు. రాజు మృతదేహం పోస్టుమార్టం వీడియో కూడా చిత్రీకరణ జరిగిందన్నారు. అలాగే ఏడుగురి సాక్ష్యాల న‌మోదు ప్ర‌క్రియ చిత్రీక‌ర‌ణ జ‌రిగింద‌ని వివ‌రించారు. దీనిపై స్పందంచిన కోర్టు పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది. వీడియోలు రేపు రాత్రి 8 గంట‌ల‌క‌ల్లా అంద‌జేయాల‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.