అంగ‌న్వాడీ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి హైకోర్టు అనుమ‌తి

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి హైకోర్టు అనుమ‌తినిచ్చింది. దీంతో రాష్ట్రంలో సుమారు 600 అంగ‌న్వాడీ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు భ‌ర్తీకానున్నాయి. గ‌తంలో ఈ పోస్టుల భ‌ర్తీ నిబంధ‌న‌ల ప్ర‌కారం చేయ‌ట్లేదని, నియామ‌క ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని కొంత‌మంది హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం పోస్టుల భ‌ర్తీపై స్టే విధించింది. తాజాగా ఉన్న‌త‌ న్యాయ‌స్థానం స్టేను ఎత్తివేస్తూ.. నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్రంలో సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల భ‌ర్తా చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.