Sonu Sood: మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్

ముంబయి (CLiC2NEWS): సోనూసూద్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సోనూసూద్ శక్తి మేర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా ఎక్కువగా ఉండడం, ఆక్సిజన్ కొరత పెరుగుతుండడంతో సోనూసూద్ తుష్టి ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైన ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ కావాలి అంటే 02261403615 ఈ నంబర్‌కు మిస్ కాల్ ఇస్తే చాలని సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
`ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది మా సాయం కోరారు. అందుకే రెండు ఫౌండేషన్‌తో కలిసి ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ మీ ఇంటి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఉచితంగా మేము మీకు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ అందిస్తాం. మీ పని అయిన తర్వాత ఖాళీ కాన్‌సెంట్రేటర్ తిరిగి పంపండి.` అని సోనూసూద్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.
Delhi, Lets Save More Lives. Oxygen concentrators on your way.
To register, give a Missed Call on 022-61403615.
Thank You @tushti_india @DTDCIndia for joining hands.@SoodFoundation 🇮🇳 pic.twitter.com/feF0KtdmJP
— sonu sood (@SonuSood) May 15, 2021