హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వ‌చ్చేసింది

హైదరాబాద్ (CLiC2NEWS):  తెలంగాణ‌లో హుజూరాబాద్‌, ఎపిలోని బ‌ద్వేలు శాస‌న‌స‌భ స్థానాల‌ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌రు 30న ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది.
ఈ మేర‌కు అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

హుజురాబాద్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..

  • అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
  • అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
  • అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
  • నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
Leave A Reply

Your email address will not be published.