Hyderabad: చిన్నారిపై అత్యాచారం.. దోషికి 20యేళ్ల జైలుశిక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు , రూ. 25 వేల జరిమానాను విధిస్తూ నాంపల్లిలో మొదటి అదనపు ఎంస్‌జె కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఈ మేరకు దోషి చెన్నయ్యకు శిక్ష ఖరారు చేసింది. 2020 డిసెంబరులో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై చెన్నయ్య (50) అత్యాచారినికి పాల్పడ్డ కేసులులో కోర్టు శిక్షను ఖారారు చేసింది.
అప్పట్లో ఎక్టార్ ఎస్సై రవిరాజ్ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన దంపతులు ఫిలింనగర్ ప్రాంతంలో నివసించేవారు. వారికిగల ముగ్గురు పిల్లలను ఇంట్లో ఉంచి వారు ఇళ్లల్లో పనులు చేయడానికి వెళ్లేవారు. ఇళ్లల్లో పని ముగించుకుని ఇంటి వచ్చే సరికి బాలిక నొప్పగా ఉందని చెప్పింది. దీంతో ఏం జరిగిందని తల్లి అడగ్గా.. పక్కన ఉండే తాతయ్య బొమ్మలు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి తలుపు వేశాడని.. బాలిక జరిగిన విషయం చెప్పింది. భార్యభర్తలు ఇద్దరు కలిసి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.