Hyderabad: సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ బిసి స్టడి సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచింతంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టడి సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. యుపిఎస్‌సి నిర్వహించే సివల్స్ పరీక్షకు అర్హత గల బిసి అభ్యర్థులు నవంబరు 22వ తేదీ లోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఈ దరఖాస్తులను http://tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదుచేయాలి. ఈనెల 28వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకోసం 040-24071178 నంబరును సంప్రదించగలరు.