డయాలసిస్ పేషెంట్‌లకు జీవితకాలం పింఛను: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డయాలసిస్ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌పాస్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారిని.. అందులో 10 వేల మందికి ప్రభుత్వమే ఉచితంగా డయాలసిస్ చేయిస్తుందని అన్నారు. ప్రతి ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని అన్నారు. ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మెడిసన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతినెలా 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయిని.. దీని కోసం రూ. 1000 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. మెంటల్ హెల్త్ హాస్పిటల్ సహకారంతో 24 గంటల టెలీ మెంటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. మానసిక సమస్యలకు పరిష్కారం కోసం బాధితులు 14416 నంబరుకు కాల్ చేయవచ్చని తెలిపారు. కాల్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచాతామని మంత్రి వివరించారు.