తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు

హైదరాబాద్ ( CLiC2NEWS): రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు పొండి ప్రవహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు పలు చోట్ల అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చిల్లకల్లు, నందిగామలో జాతీయ రహదారి65పై వరద, ఎపి-తెలంగాణ సరిహద్దు రామపురం క్రాస్ వంతెన కూలిపోయిన ఘటన, సూర్యాపేట- ఖమ్మం రహదారిపై పాలేరు వరద ప్రవాహం.. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఎస్‌పి ఖమ్మం కమిషనర్ ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ సూచనలు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లనుండి బయటకు రాకూడదు. అత్యవసర పరిస్తితుల్లో అధికారులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. విజయవాడ వెళ్లే వారు చౌటుప్పల్-నార్కట్‌పల్లి – నల్గొండ- పిడుగురాళ్ల – గుంటూరు మీదుగా వెళ్లాలని సూచించారు. ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్ – నార్కట్ పల్లి – అర్వపల్లి – తుంగతుర్తి – మిరపెడ బంగ్లా మీదుగా వెళ్లాలని తెలిపారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్తితుల్లో 9010203626 కు ఫోన్ చేయాలని సూచించారు.