తెలంగాణలోని సీనియర్ అధికారులకు ఐఎఎస్ హోదా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సర్వీస్‌కు చెందిన 10 మంది సీనియర్ అధికారులకు యుపిఎస్‌సి ఐఎఎస్ హోదా కల్పించింది. రెవెన్యూ కోటాలో ఐదుగురికి , నాన్ రెవెన్యూ కోటాలో మరో ఐదుగురు చొప్పున అధికారులకు ఐఎఎస్ హోదా లభించింది. రాష్ట్ర అధికారులకు జనవరి నెలలో యుపిఎస్‌సి ఇంటర్వ్యూలు నిర్వహించి.. వాటి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రెవెన్యూ విభాగం నుండి అరుణ శ్రీ, నిర్మల కాంతి వెస్తీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక బడుగు చంద్ర శేఖర్‌లు, నాన్ రెవెన్యూ విభాగం నుండి అశోక్ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్‌కు ఐఎఎస్ హోదా లభించింది.