నడుము నొప్పి వెంటనే తగ్గాలంటే..

నడుము నొప్పి అతిసాధారణమైనది. ఇది అన్ని వయసుల వారికీ వస్తుంది. సరైన పొజిషన్లో కూర్చోకపోవటం, పడుకోలేకపోవటం, ఎక్కువగా కూర్చోని కంప్యూటర్ ఆపరేటర్ చేయటం, బరువులు లేపటం, ఎత్తయినా ప్రదేశంలో నుండి దూకటం. జారిపడటం, బైక్ జర్నీ ఎక్కువగా చేయటం… త‌దిత‌ర కారణాల వ‌ల్ల నడుము దగ్గర కండరాలు, లీగ్మెంట్ లు తెగటం, లేదా నలగటం,లేదా వాపుకు గురికావటం, లాంటి కారణాలు వలన నడుము నొప్పి వస్తుంది.

కొన్నిసార్లు డిస్కప్రోలాప్ వలన కూడా నడుము నొప్పి వస్తుంది. ఈ నొప్పి పాత రోగం దేశంలో లక్షలాది మందిని పిడిస్తుంది. ఇది చాలా మొండి రోగం. దీన్ని శాశ్వతంగా తొలిగించటానికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుకూలమైన ఫలితాలు రావటం లేదు. ఈ రోగం చిన్న వయస్సు, పెద్ద వయస్సు అనే భేదం లేకుండా వస్తుంది.

మూత్రకోశంలో ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధులు, వెన్నుముకకు టీబీ సోకటం, స్త్రీలలో బహిస్టు అయి ముట్లు ఆగిపోవటం, జననేంద్రియలకు చీము పట్టటం, గర్భకోశ వ్యాధులు వున్న సరే నడుము నొప్పి వస్తుంది.

కానీ దీనిలో ఏ సమస్యతో వెన్ను, నడుము నొప్పి వచ్చిందో తెలుసుకోవాలి. దానిని బట్టి నివారణ మార్గాలు, మందులు వాడాలి.

వ్యాధి లక్షణాలు..

  1. నడుము ప్రాంతమున విపరీతమైన నొప్పి, వాపులు ఉంటాయి.
  2. ముందుకు వంగలేము. బరువులు లేపలేము.
  3. రోగి పడుకోలేకపోవటం,కూర్చోలేకపోవటం, కదల లేకపోవటం, మొదలగున్నవి.
  4. శ‌రీర బ‌రువు పెర‌గ‌డం

ఆయుర్వేద మందులు

దశమూల క్వాదం. త్రయోదశ గుగ్గులు, వాత విధ్వంసిని, యోగ రాజా గుగ్గులు, నారాయణ తైలం, ఇలాంటివి రోగిని బట్టి, దోషాలను బట్టి, అతనికి మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది.

  1. నొప్పి వున్న భాగం ఆయిల్ తో మర్ధన చేయటం,
  2. వేడి కాపటం,
  3. మల బద్ధకం ఉంటే మెడిసిన్ వాడటం, ఇలాంటివి చేస్తే గ్యాస్ వలన వచ్చే నడుము నొప్పి కూడా తగ్గుతుంది.
  4. యోగ, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామలు చేయటం,
  5. బరువులు లేపవద్దు.ఎక్కువగా బైక్ జర్నీ చేయవద్దు.
  6. గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్దాలు తినకూడదు. ఇలాంటి వి చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.
  7. పై మందులు డాక్ట‌ర్ గారి స‌ల‌హా మేర‌కు వాడండి

-బహర్ ఆలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.