ఉత్కంఠ పోరులో మంచుకే ‘మా’ పీఠం

హైదరాబాద్ (CLiC2NEWS): హోరా హోరీగా సాగిన `మా` ఎన్నికల్లో మంచు విష్ణు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో `మా` ఉత్కంఠ పోరుకు తెరపడింది. ఈ ఫలితాల్లో అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే ఎక్కువగా విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. ఈ భారీ విజయంతో మోహన్‌బాబు అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
భారీ విజయంతో మంచు ఫ్యామిలీ మద్దుతుదారులు మోహన్ బాబు జిందాబాద్.. విష్ణు బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈసారి జరిగిన `మా` ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.