హోంగార్డులకు గౌరవ వేతనం పెంపు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు గౌరవవేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల వేతనం 30% పెరిగింది. 2018 జూలై నాటి గౌరవవేతనంపై 30% పెంచింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఇటీవల తెలపిన విధంగా హోంగార్డుల గౌరవవేతనం పెంచుతూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల గౌరవ వేతనాలు సవరించినపుడు వీరి వేతనాలు కూడా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.