Champions Trophy: IND vs NZ.. భారత్ స్కోర్ 249/9

దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో ఆదివారం భారత్ , న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ 79 పరుగులు చేయగా.. హార్దిక్ పాండ్య 45 పరుగులు తీశాడు. అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ 15, గిల్ 2, విరాట్ కోహ్లీ 11 పరుగులతో నిరాశపరిచారు. టీమ్ ఇండియా జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. శ్రేయస్, పటేల్, పాండ్య ఆటతో జట్టు కష్టాల్లోంచి బయటపడగలగింది. రాహుల్ 23పరుగుల చేయగా.. జడేజా 16 పరుగులు చేశారు. హార్దిక్ 45 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు.. 2 సిక్స్‌లు తీసి చివర్లో మెరుపులు మెరిపించాడు.