ఖొఖొ పురుషుల ప్రపంచకప్ భారత్ కైవసం
ఢిల్లీ (CLiC2NEWS): ఖొఖొ ప్రపంచకప్ లో భారత మహిళలు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా పురుషుల ఖొఖొ ప్రపంచ కప్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఖొఖొ ప్రపంకప్ లో పురుషుల జట్టు విజయం సాధించింది. నేపల్‌పై 54-36 తేడాతో విజభేరి మోగించింది. మహిళల, పురుషుల ప్రత్యర్థి జట్టు నేపాల్ కావడం గమనార్హం.
పురుషుల జట్టు మొదటి రౌండ్‌లో 26-18 తేడాతో ఆధిక్యంలో కొనసాగి.. మూడో రౌండ్ ముగిసే సరికి 56-18 లీడ్‌లో ఉంది. నాలుగో రౌండ్‌లో నేసాల్ 37 పాయింట్లు సాధించాల్సి ఉంది. కానీ కేవలం 18 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో భారత్ విజేతగా నిలిచింది. తొలిసారిగా నిర్వహించిన ఖొఖొ ప్రపంచకప్ లో భారత మహిళల, పురుషుల జట్లు విజేతగా నిలిచాయి.