India Corona: స్వ‌ల్పంగా త‌గ్గిన కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులతో పాటుగా మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గ‌డిచిన  24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 62,480 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ శుక్ర‌వారం కరోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది.

  • గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,587 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,83,490 కి చేరింది.
  • గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 88,977 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 2,85,80,647 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 7,98,656 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
Leave A Reply

Your email address will not be published.