India Corona: మ‌రింత త‌గ్గిన కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కాస్త అదుపులోకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశంలోని ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో స‌హా ప‌లు ర‌కాల క‌ట్ట‌డి చేర్య‌ల ఆంక్ష‌లు ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ క‌రోనా మృతుల సంఖ్య మాత్రం ఆందోళ‌న క‌రంగానే ఉంది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 2,22,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగింది. తాజాగా 3,02,544 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 2,37,28,011 మంది బాధితులు క‌రోనా బారి నుండి కోలుకున్నారు.

గ‌డిచిన 24 గంటల్లో మరో 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,03,720 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్‌ కేసులున్నాయి.

Leave A Reply

Your email address will not be published.