India Covid: మ‌ళ్లీ పెరిగిన కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): నిన్న‌టి వ‌ర‌కు దేశంలో 40వేల దిగువ‌కు న‌మోదైన క‌రోనా కేసులు.. ఇవాళ రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం కేసులు పెరిగాయి. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 45,951 కేసులు న‌మోద‌య్యాయి.  ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ బుధ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్పటివ‌ర‌కు దేశంలో మొత్తం 3,03,62,848 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.

  • 24 గంట‌ల్లో 60,729 మంది డిశ్చార్జ్ అయ్యారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 2,94,27,330 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
  • ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 817 మంది మృతి చెందారు.
  • దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,98,454కి చేరింది.
  • ప్ర‌స్తుతం దేశంలో  5,37,064 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
  • దేశంలో 33,28,54,527 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.
Leave A Reply

Your email address will not be published.