చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి భారత్‌కు స్వర్ణం

బుడాపెస్ట్ (CLiC2NEWS): చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన 11వ రౌండ్లో డి. గుకేశ్.. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను ఓడించగా.. జాన్ సుబెల్జ్‌పై అర్జున్ ఇరిగేశీ విజయం సాధించాడు. ఈ పోటీలో టైటిల్ గెలిచేందుకు 11వ రౌండ్లో భారత్‌కు డ్రా సరిపోతుంది. ఇపుడు మిగిలిన రెండు గేమ్‌లలో ఓడిపోయినా.. స్వర్ణం ఖరారు.