India Covid: కొత్త‌గా 44,643 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 44,643 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర వైద్యారోగ్య శాఖ క‌రోనా బులిటెన్ వెల్ల‌డించింది.

  • తాజాగా క‌రోనా బారిన ప‌డి 464 మంది చ‌నిపోయిన‌ట్లు
  • గ‌త 24 గంట‌ల్లో ఈ మ‌హమ్మారి నుంచి 42,096 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.1 కోట్లకు చేరింది.
  • ప్ర‌స్తుతం దేశంలో 4,14,159 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 49.53 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.