ఖొఖొ ప్రపంచకప్‌లో సత్తా చాటిన భారత అమ్మాయిల జట్టు
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖొఖొ ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ భారత్ 78-40తో నేపాల్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఖొఖొ ప్రపంచకప్‌ను నిర్వహించిన తొలిసారే భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. భారత జట్టు తుది పోరులో 34-0 ఆధిక్యంతో మెదటి టర్న్‌లో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అనంతరం కోండొ టర్న్ ముగిసేసరికి నేపాల్ 35-24 తో ఉంది. మూడో టర్న్‌లో భారత జట్టు మళ్లీ పుంజుకుని వరుసగా పాయింట్లు సాధించి.. 49లో నిలిచింది. చివరి టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు.. భారత్ 38 పాయింట్లతో సాధించి భారత్ విజేతగా నిలిచింది.