భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీనుండి 22వ తేదీ వరకు.. 15 రోజులు వైభవంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. హైటెక్స్‌లో సిఎం కెసిఆర్ ఈ వజ్రోత్సవాలను ప్రారంభిస్తారు. ముగింపు వేడుకలు 22వ తేదీన ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నగరం మొత్తం స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాతో హోర్డింగులను ప్రదర్శించనున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నాయకుల చరిత్ను తెలిపే 15 రోజులపాటు ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని, పాఠశాలలు, సినిమాహాళ్లలో ఈ చిత్రాలను ప్రదర్సిస్తామని వివరించారు. పాఠశాలలో వ్యాసరచన, పాటల పోటీలు, నాటకప్రదర్శనలు, కవి సమ్మేలనాలు ఉంటాయని తెలిపారు. వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని చెప్పారు.