చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ఒకేసారి రెండు స్వర్ణాలు
చెస్ ఒలింపియాడ్‌లో పసిడి సాధించిన భారత మహిళల జట్టు

బుడాపెస్ట్ (CLiC2NEWS): 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి రెండు పసిడి పతకాలు సాధించింది. పురుషుల మహిళల జట్లు తొలిసారి స్వర్ణం గెలుచుకొని రికార్డు సృష్టించాయి. పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్.. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను ఓడించగా.. జాన్ సుబెల్జ్‌పై అర్జున్ ఇరిగేశీ విజయం సాధించాడు. ఈ పోటీలో టైటిల్ గెలిచేందుకు 11వ రౌండ్‌లో భారత్‌కు డ్రా సరిపోతుంది. ఇపుడు మిగిలిన రెండు గేమ్‌లలో ఓడిపోయినా.. స్వర్ణం ఖాయంమైంది
భారత మహిళల జట్టు డి.హారిక, దివ్య దేశ్‌ముఖ్‌లు విజయం సాధించగా.. ఆర్.వైశాలి డ్రాగా ముగించింది. వంతిక అగర్వాల్ విజయం సాధించింది. 11వరౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించి మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది.