ఈ నెల 5నుండి ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సిబిఎస్‌సి, ఐసిఎస్‌సి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 6 నుండి మార్చి 25 వరకు జరుగుతాయి. విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచారు. ముందుగా కాలేజ్ లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. తాజాగా ప్రథమ, ద్వితీయ ఇంటర్‌తో పాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్‌టికెట్లను వబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు రోల్ నంబర్ లేదా ఎస్ ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ వివారలను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్దమవుతున్నారు.