International Day of the Girl Child: కనులకు ఎంత చక్కనో..

పట్టు పరికిణీ ల్లో
మువ్వల పట్టీలతో
నట్టింట్లో అమ్మాయి
తిరుగుతుంటే వట్టిపోయిన
ఇంటికి లక్ష్మికళ వచ్చినట్లుగా
ఉన్నట్టు ఎంత చక్కనో….!!
నెత్తిన సూరీడు శివతాండవం
చేస్తున్న వేళ నీరసించి
ఇంటికొచ్చిన మాకు చల్లని
నీళ్లనిచ్చి సేదతీర్చే మాతల్లి
కనులకు ఎంత చక్కనో….!!
పొలంల పనిచేసుకునే రైతుకు
సమయానికి అన్నం పెట్టి
ఆకలి తీర్చి ఆదరించే
అన్నపూర్ణ ఎంత చక్కనో….!!
అక్కగా ఆదరించి
చెల్లెలా లాలించి
భార్యగా తోడునుపంచుకొని
అమ్మలా ప్రేమించే
సృష్టి కి ప్రతిస్వరూపమైన
అమ్మాయిని ఏదగనిద్దాం….!!
-పద్మజ బొలిశెట్టి
అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు