హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన ఎఫిడ్రిన్ స్వాధీనం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/INTERNATIONAL-DRUG-GANG-ARRESTED.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసుల అరెస్టు చేశారు. చైన్నై కేంద్రంగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.3 కోట్ల విలువచేసే ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆస్ట్నేలియాలోని మెల్‌బోర్న్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. నగరంలోని కొరియర్ సర్వీసుల ద్వరా విదేశాలకు సరఫరా చేస్తున్నారు. బ్యాంగిల్స్, ఫోటో ఫ్రేమ్‌లలో మాదకద్రవ్యాలను పెట్టి తరలిస్తున్నట్లు, 1 గ్రామ్ ఎఫిడ్రిన్.. రూ.8వేలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఆరుగురు కొరియర్ సిబ్బందిని కూడా ఆరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.