సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
విశాఖ పట్టణం(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశభ్రత, పచ్చదనం తదితర అంశాలపై ఈ విశిష్ట గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువ పత్రాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ఐఎప్‌వొ ఆలయ ఇఓ సూర్యకళకు అందజేశారు. కేంద్ర ప్రసాద పథకం ద్వారా ఈ పుణ్యక్షేత్రానికి రూ. 53కోట్లు వచ్చినట్టు ఆలయ ఇఓ తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.