Hyderabad: నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): TSIICL అభివృద్ధి చేస్తున్న రహదారి విస్తరణ భాగంగా ఓఆర్ఆర్ పటాన్‌చెరు నుండి ఓఆర్ఆర్ గచ్చిబౌలి వరకు ఆరు లేన్ల రహదారిని విస్తరించడానికి నిర్ణయించింది, ఇందులో భాగంగా ఖానాపూర్ రిజర్వాయర్ నుండి షేక్‌పేట్ జలాశయానికి వెళ్లే 1200mm డయా PSC పైప్‌లైన్ జంక్షన్ పనులు జలమండలి చేపట్టనుంది.
కావున, తేదీ: 28.12.2021 మంగళవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 29.12.2021, బుధవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటల వరకు ఖానాపూర్ రిజర్వాయర్ పరిధిలో ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18: మణికొండ మున్సిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీ ప్రాంతాలైన గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నాంపూర్ మరియు మంచిరేవుల గ్రామాల పరిధిలోని ప్రాంతాలు.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని ప్రకటన ద్వారా తెలియజేశారు.