తెలంగాణలో 20 మంది పోలీసు అధికారులకు ఐపిఎస్ హోదా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణకు చెందిన 20 మంది పోలీసు అధికారులకు ఐపిఎస్ హోదా లభించింది. వీరిన తెలంగాణ రాష్ట్ర పోలీసు సర్వీసునుండి ఇండియన్ పోలీసు సర్వీసుకు నియమించారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఐపిఎస్ హోదా లభించిన వారు..
2016 బ్యాచ్‌కు చెందిన కోటిరెడ్డి, సుబ్బరాయుడు, నారాయణరెడ్డి, డివి శ్రీనివాసరావు, టి. శ్రీనివాసరావు, అన్నపూర్ణ, పద్మజ, జానకి ధరావత్
2017 బ్యాచ్‌కు చెందిన పి. యాదగిరి
2018 బ్యాచ్‌కు చెందిన కెఆర్ నాగరాజు, ఎం. నారాయణ
2019 బ్యాచ్‌కు చెందిన వి.తిరుపతి, ఎస్. రాజేంద్రప్రసాద్, డి. ఉదయ్ కుమార్‌రెడ్డి, కె. సురేష్ కుమార్
2020 బ్యాచ్‌కు చెందిన బి.అనురాధ, సి. అనసూయ, షెక్ సలీమా, ఆర్.గిరిధర్, సి.హెచ్.ప్రవీణ్ కుమార్