రైల్వే జ‌న‌ర‌ల్ బోగీ కాదు.. యుఎస్ విమానం!

కాబుల్ (CLiC2NEWS): మామూలు రైల్వే ప్యాసింజ‌ర్‌లోని జ‌న‌ర‌ల్ బోగీల్లో జ‌నాలు సీట్లు స‌రిపోక ప్ర‌యాణికులు కిందే కూర్చుంటారు. ఈ ఫొటోను చూసిన వారికి ట‌క్కున అదే గుర్తుకు వ‌స్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబ‌న్ల రాక‌తో తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురైన అక్క‌డి ప్ర‌జ‌లు బ‌తుకు జీవివుడా అంటూ కాబుల్ విడిచి ప‌రుగులు పెడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు దేనికీ వెన‌కాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో అమెరికా విమానంలో క‌నిపించిన దృశ్యం అక్క‌డి ప్ర‌జ‌ల దుస్థితికి అద్దంప‌డుతోంది. ఒకేసారి విమానంలో ఏకంగా 640 మంది కింద కూర్చుని ప్ర‌యాణించారు. మీరు ఈ 640 మంది కింద కూర్చున్న‌ ఫొటోను కింద చూడ‌వ‌చ్చు..

తాలిబ‌న్ల అరాచ‌క‌పాల‌న‌తో మ‌ళ్లీ చీక‌టి రోజులు రాబోతున్నాయ‌న్న భ‌యాందోళ‌న‌ల‌తో భారీగా ప్ర‌జ‌లు నిన్న‌టి నుండి అఫ్ఘాన్‌ను విడిచి వెళ్లేందుకు కాబుల్ విమానాశ్ర‌యానికి పోటెత్తారు. ఈ క్ర‌మంలో విమానంలో చోటుకోసం ర‌న్‌వేపై ప‌రుగులు తీశారు. ఒక యుఎస్ విమానంలో ఏకంగా 640 మంది అఫ్ఘాన్ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు. వారి వ‌ద్ద ఎలాంటి వ‌స్తువులు లేవు.. తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకునేందు.. ఇళ్లు.. వ‌స్తువులు అన్నీ విడిచి ఇత‌ర‌దేశాల‌కు పారిపోతున్నారు.

640 మంది అఫ్ఘాన్ ప్ర‌యాణికులు ఎక్కిన విమ‌నం ఫొటోను అమెరికా అధికారిక మీడియా సంస్థ `డిఫెన్స్ వ‌న్‌` త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్టు చేసింది. ఇప్పుడు ఈ ఫొటో ఇంట‌ర్‌నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి.

Leave A Reply

Your email address will not be published.