అవనిగడ్డలో యథేచ్చగా ‘ఐసిస్ డ్రగ్’ విక్రయాలు..

అవనిగడ్డ (CLiC2NEWS): కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్ గా పేరుపొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ (మాదకద్రవ్యం) ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఐసిస్ , బొకోహారమ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ డ్రగ్‌ను విరివిగా వినియోగించేవారు. అందుకే దీనికి ఐసిస డ్రగ్ అంటారు. దీన్నే షైటర్ డ్రగ్ అని కూడా పిలుస్తారు. అలసట, నిద్ర రాకుండా ఉండటానికి ,ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయడానికి ఐసిస్, బోకోహారమ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటారని సమాచారం.
మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు, ఏజెన్సీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్‌లో ఈ మాదక ద్రవ్యాల రాకెట్ బయటపడింది. మెడికల్ షాపులో యథేచ్చగా ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా అమ్మేస్తున్నారు. ఈ గల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ తనిఖీల్లో చాలా కాలం నుండి మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. 2022-23, 2023-24 సంవత్సరాల్లో కేవలం ఒక్క షాపులోనే 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు విక్రయించినట్లు సమాచారం.