ఊహించ‌ని ముప్పులో చిక్కుకోక‌ముందే.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం మేలు

ఢిల్లి (CLiC2NEWS): ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. బ్రిట‌న్‌లో మిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కేసులు 37వేల‌కు చేరినాయి. ఒక్క‌రోజులో 12వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.
ఒక‌వేళ మ‌న‌దేశంలో కూడా అటువంటి ప‌రిస్థితులు వ‌స్తే ఎదుర్కొనేందుకు స‌ద్ధంగా ఉండాలంటూ ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా సూచించారు.
మ‌న‌దేశంలో ఒమిక్రాన్ కేసులు పెర‌గుండా చూసుకోవాల‌ని యూకే త‌ర‌హాలో ఇక్క‌డ ప‌రిస్థితులు దిగ‌జార‌వని ఆశిద్దాం. స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. ఊహించ‌ని ముప్పులో చిక్కుకోవ‌డం కంటే.. అప్ర‌మ‌త్తంగా ఉడ‌టం అన్నిటిక‌న్నా మేలు అంటూ మీడియాకు వెల్ల‌డించారు.
భార‌త్‌లో ఒమిక్రాన్ కేసుల 150 కిపైగా న‌మోద‌య్యాయి. మ‌హారష్ట్రలో 54 మందిలో ఈ వేరియంట్ నిర్థార‌ణ‌య్యింది. యూకేలో ప‌రిస్థితే భార‌త్‌లో వ‌స్తే.. రోజుకు దాదాపు 14 లక్ష‌లకు పైగా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని గతంలోనే కేంద్రం హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.