నీటిని కాచి తాగితే ఆరోగ్యకరం

ప్రస్తుతం వర్షాలు బాగా పడుతున్నాయి. దీని వలన నీరు కలుషితంగా మారుతుంది. మరియు ఈ నీరు తాగటం వలన జ్వరాలు, జలుబు, అంటువ్యాధులు కూడా రావచ్చును. కనుక బావి నీరు, సెలయేరు నీరు, బోర్ నీరు, కుళ్లాయి నీరు, కుండ నీరు, మినరల్ వాటర్ ఏదైనా సరే వేడి చేసి, చల్లార్చి వడపోసి తాగాలి. లేకపోతే జబ్బులు వస్తాయి.
బావి నీళ్లు తియ్యగా కొద్దిగా ఉప్పుగా ఉంటాయి. ఆకలిని పెంచుతాయి. తృప్తినిస్తాయి. మూత్రం సాఫిగా వస్తుంది. వాతాన్ని, కఫాన్ని తొలిగిస్తాయి. నీళ్లను కాచి తాగితే ఎల్లవేళలా ఆరోగ్యకరం.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు