రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి ఆస్తుల‌పై కొన‌సాగుతున్న ఐటి సోదాలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి ఆస్తులపై ఐటి సోదాలు కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం మొద‌లైన సోదాలు ఈ రోజు కూడా కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. మంత్రికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఆయ‌న‌కు చెందిన ఇంజ‌నీరింగ్‌, మెడిక‌ల్ క‌ళాశాల‌లు, హాస్పిట‌ల్స్ తో పాటు వాటికి సంబంధించిన కార్యాల‌యాల‌లో, డైరెక్ట‌ర్స్ నివ‌షాల‌లోనూ సోదాలు కొన‌సాగుతున్నాయి. మంత్రి కుమారుడు, అల్లుడు నివాసంలోనూ ఐటి వ‌ర్గాలు సోదాలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లతో పాటు బంగారం, కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు మంత్రి కుమారుడు మ‌హేంద‌ర్ రెడ్డిపై సిఆర్‌పిఎఫ్ ద‌ళాలతో కొట్టించార‌న్నారు. అత‌నికి ఛాతీలో నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.