‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకం: దరఖాస్తులకు ఆహ్వానం
అమరావతి (CLiC2NEWS): విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎపి ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందజేస్తుంది. ఈ పథకం కింద ఆర్ధిక సాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుండి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రంపంచంలోని టాప్ 200 లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ యూనివర్సిటీలు లేదా విద్యాసంస్థలల్లో పిజి, పిహెచ్‌డి, ఎంబిబియస్ అభ్యసించాలనుకునే ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటి, ఇబిసి, కాపు విద్యార్థులకు ఎపి సర్కార్ ఆర్ధిక సాయం అందిస్తోంది.
ఇంటర్, డిగ్రీ, పిజిలలో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ అర్హత కలిగి ఉండాలి. ఎంబిబిఎస్ కోర్సకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలోని టాప్ `100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందితే ప్రభుత్వమే 100% ఫీజు చెల్లిస్తుంది. 101 నుండి 200 లోపు ర్యాంకు కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ. 50 లక్షలు లేదా 50% ఫీజును.. ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వమే భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు www.//jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.