జలమండలి ఉద్యోగులకు టెక్నికల్ ఆఫీసర్స్‌గా పదోన్నతులు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. డిప్లోమా, బీటెక్ విద్యార్హతలు కలిగిన వారికి జలమండలి టెక్నికల్ ఆఫీసర్స్ (టీవో)గా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు సోమవారం ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిజిఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం టీవీ సరస్వతి, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి జయరాజ్, అసోసియేట్ ప్రసిడెంట్లు రాజ్ రెడ్డి, జహంగీర్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.