జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

హైదరాబాద్ (CLiC2NEWS): వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు బుధవారం(20.10.2021) ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలువురు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, సీజీఎం ఖాదర్, జీఎంలు సరస్వతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.