రేపు మేడ్చల్‌లో జాబ్ మేళా..

మేడ్చల్ (CLiC2NEWS): మేడ్చల్ లోని ఐటిఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థలు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని నిర్వాహకు లు కోరుతున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల లోపు మాత్రమే ఉన్న యువతీ యువకులు అర్హులు.పూర్తి వివరాలకు 73868 09422, 98664 65024 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.