జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురిసిన వ‌ర్షాలు.. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో ఇవాళ (ఆదివారం) జూరాలకు భారీగా వరద నీరు పోటెత్తింది.

దీంతో జూరాల ప్రాజెక్టులోకి 3.75 లక్షల క్యూసెక్కుల నీరు వ‌స్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం 41 గేట్లు ఎత్తి 3,76,027 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే లోత‌ట్టు ప్రాంతాల ప్రాజ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు పేర్కొన్నారు.

జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ఇప్ప‌టు ఈ జలాశయంలో 316.55 మీటర్ల నీటిమట్టం ఉంది. జూరాల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా, 6.01 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.