TS: హైకోర్టు సిజెగా జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర‌ శ‌ర్మ ప్ర‌మాణ‌స్వీకారం

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శ‌ర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై .. జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర శ‌ర్మ చేత ప్ర‌మాణం చేయించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సిఎం కెసిఆర్‌, సిఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర కు గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు.

జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1961 నవంబర్‌ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరొందిన ఆయన తండ్రి బీఎన్‌ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. హరిసింగ్‌గౌర్‌ వర్సిటీలో 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు సాధించారు.

  • 1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్నారు.
  • 2003లో ఎంపి హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు.
  • 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.
  • 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియ‌మితులయ్యారు.
  • 2010 ఎంపి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
  • 2021 జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
  • 2021 ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.
  • తెలంగాణ‌లో 2019 జనవరి 1వ తేదీన తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో నాలుగో సిజెగా జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మప్ర‌మాణ స్వీకారం చేశారు.

  1. తొలి సీజేగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌
  2. రెండో సిజెగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌,
  3. మూడో సిజెగా జస్టిస్‌ హిమాకోహ్లీ
  4. నాలుగో సిజెగా జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ (ప్ర‌స్తుతం రేపు ప్ర‌మాణ స్వీకారం చేశారు.
Leave A Reply

Your email address will not be published.