మండపేట పట్టణ సిఐ గా కె దుర్గాప్రసాద్..

మండపేట (CLiC2NEWS) : మండపేట టౌన్ సిఐగా నూతనంగా కె దుర్గాప్రసాద్ నియమితులు అయ్యారు. ఈయన గతంలో రాజమండ్రి డివిజన్, చింతూరు స్టేషన్ లలో సిఐగా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. సీఐగా పదోన్నతి పదోన్నతి పొందక ముందు ఈయన రామచంద్రపురం, రాయవరం, అంగర పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేసి ప్రజలమన్ననలు పొందారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సీఐ కె దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తానని అన్నారు. తాను పట్టణంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే దానిపై దృష్టి సారించి చెక్ పెడతానని అన్నారు. టౌన్ లో ఉండే ప్రధాన రోడ్లలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తానని అన్నారు. పట్టణంలో పేకాట జూదం కోడి పందేలు వంటి ఆటలు ఏమైనా సాగిస్తే అటువంటి వారి ఆట కట్టిస్తానని అన్నారు. అదే విధంగా క్రికెట్ బెట్టింగ్ మాఫియాను కూడా విడిచి పెట్టేది లేదన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించే విధంగా శాంతిని నెలకొల్పడానికి కృషి చేస్తానని వివరించారు. ప్రజలు చిన్న చిన్న విషయాలకు గొడవలకు పోకుండా సాధ్యమైనంత మేర సర్దుబాటు చేసుకొని కలిసి మెలసి ఉండాలని సూచించారు. చట్టాలు బలంగా ఉన్నాయని కాదని గొడవలు పడి స్టేషన్ మెట్లు ఎక్కితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లిన సందర్భాల్లో ఎవరి వల్ల అయినా అభద్రతా భావానికి గురి అయితే వెంటనే తనకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని అన్నారు. మహిళల రక్షణకు కూడా ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రజలు పోలీసులను స్నేహితులుగా భావించి తమ తమ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తమకు తెలియజేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.