Jayashankar Bhupalpally: ఎసిబి వలలో కాటారం తహసీల్దార్ సునీత
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/kataram-tahasildar.jpg)
కాటారం (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే వున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్ సునీతను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3లో భూమికి ఆన్‌లైన్ చేసి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో స్థానిక తహసీల్దార్ సునీతను ఆశ్రయించాడు.
అతను అడిగినవి చేయడం కోసం తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దాంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇవాళ (గురువారం) రూ. 2 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తహశీల్దార్ సునీతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.