మాజి సిఎం కెసిఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతం
హైదరాబాద్ (CLiC2NEWS): మాజి సిఎం కెసిఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద అసుపత్రి వైద్యులు తెలిపారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ కాలుజారి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఆస్సత్రి వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలని తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం కెసిఆర్‌కు శస్త్ర చికిత్సను నిర్వహించారు. రెండు నెలల్లో కెసిఆర్ పూర్తిగా కోటుకుంటారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.